టాలీవుడ్ మాస్ దర్శకుల్లో ఒకరు అయినటు వంటి వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయినటు వంటి యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శీను మూవీ తో తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ నటుడు ఆ తర్వాత అనేక సినిమా లలో హీరో గా నటించాడు.

అందులో రాక్షసుడు ... జయ జానకి నాయక సినిమాలు మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. రాక్షసుడు మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొంది మంచి విజయం సాధించగా ... జయ జానకి నాయక మూవీ పక్క కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొంది మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ నటుడు తాజాగా చత్రపతి అనే మూవీ తో హిందీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందినటు వంటి తెలుగు సినిమా చత్రపతి కి అధికారిక హిందీ రీమేక్ గా రూపొందింది.

మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. సాయి శ్రీనివాస్ ... వినాయక్ ఈ రీమేక్ మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాను మే 12 వ తేదీన హిందీ భాషలో థియేటర్ లలో విడుదల చేశారు.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర షాకింగ్ కలెక్షన్ లను నమోదు చేసింది. మంచి అంచనాల నడుం విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజు కేవలం 45 లక్షల నెట్ కలెక్షన్ లను మాత్రమే వసూలు చేసి ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. మరి ఈ మూవీ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: