సాధారణంగా ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎందరో తారలు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇకపోతే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ యుక్త వయసులో ఉన్నప్పుడు టీబీతో బాధపడ్డాడు అని అంతేకాదు లివర్ కి సంబంధించిన సమస్యలు ఇప్పటికీ ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాయని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతేకాదు ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోయిన్ల సైతం క్యాన్సర్ బారినపడి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారు. 

అంతేకాదు హీరోయిన్లతో పాటు ఎందరో హీరోలు సైతం చెప్పుకోలేని కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక అలాంటి వారిలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు అని తెలుస్తోంది.అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్న ఈయనకి ఒక సమస్య ఉందని సమాచారం. ఇక ఆ విషయాన్ని స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లి అంజనదేవి స్వయంగా తాజాగా మాతృ దినోత్సవం సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళ్యాణ్ బాబుని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది..ఎండనక వాననక తిరుగుతూ ఉంటాడు ఆయన ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోడు.

చిన్నప్పుడు కళ్యాణ్ బాబుకి ఆస్తమా ఉండేది ..అప్పుడు కళ్యాణ్ బాబుని చాలా జాగ్రత్తగా నేను చూసుకునేదాన్ని కానీ.. ఇప్పుడు కళ్యాణ్ బాబు వేలకోట్ల మందికి సహాయం చేస్తున్నాడు... ఇంత వేల కోట్ల మందికి సహాయం చేయమని భగవంతుడు వాడికి ఇలాంటి ఒక పనిని అప్పజెప్పాడు.. అంటూ వెల్లడించింది అంజనాదేవి. అంతే కాదు వాడు తప్పకుండా ఈ విషయంలో విజయం సాధిస్తాడు.. దీని పట్ల నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను.. అంటూ ధీమా వ్యక్తం చేసింది అంజనాదేవి. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న సమస్య ఆమె బయట పెట్టడంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: