ప్రపంచ సినిమా రంగంలో అవతార్ సృష్టించిన అద్భుతం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ప్రపంచంలోనే దాదాపుగా అన్ని ప్రాంతీయ భాషలలో విడుదలై ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకువెళ్లింది.. ఇక అవతార్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ది వే ఆఫ్ వాటర్ సైతం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పటికీ కూడా ఓటీటి లో బాగానే సందడి చేస్తోంది ఈ చిత్రం.


అయితే పేరెంటు విధానంలో అందుబాటులో ఉన్న ఈ చిత్రం తాజాగా రెంటు చెల్లించకుండానే సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సినిమా స్ట్రిమింగ్ అవుతున్న డిస్నీ హాట్ స్టార్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ విజువల్ వండర్ అని జూన్ 7వ తేదీన ఫ్రీగా విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ స్టార్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే అన్ని భాషలలో స్ట్రిమింగ్ కానుందా లేదా అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మొన్నటి వరకు పే అండ్ వాచ్ విధానంలో ఉండడం వల్ల చూడలేకపోయినా శని ప్రేక్షకులు సైతం ఈ అవతార్ సీక్వెల్ ను చూడడానికి చాలా సిద్ధంగా ఉన్నారు.



మరి థియేటర్లలో వండర్ క్రియేట్ చేసిన ఈ అవతార్ చిత్రం ఓటీటి లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి మరి. ఈ చిత్రాన్ని జేమ్స్ కామరూన్ దర్శకత్వం వహించారు. ది వే ఆఫ్ వాటర్ ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక మార్చి 28న ఓటీడీలో స్ట్రిమ్మింగ్ కాగా.. ఈ సినిమా ప్రసారమవుతున్న అన్ని ఓటీటి లలో కూడా ఎలాంటి రెంటు లేకుండా స్ట్రిమ్మింగ్ చేసే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది మరి ఈ విషయంపై అధికారికంగా డిస్నీ హాట్ స్టార్ ప్రకటిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: