టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా బోయపాటి ... రామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కావడం తో ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క షూటింగ్ ను "బోయపాటి రాపో" అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తోంది. ఈ మూవీ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల ... రామ్ సరసన హీరోయిన్ గా కనిపించనుండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. రామ్ మరియు బోయపాటి ఇద్దరికీ కూడా ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఫస్ట్ థండర్ అనే పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది.

ఈ వీడియోలో రామ్ అదిరిపోయే యాక్షన్స్ సన్నివేశాలతో ... పవర్ఫుల్ డైలాగులతో రెచ్చిపోయాడు. దానితో ప్రస్తుతం ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ థండర్ వీడియోకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ వీడియోకు 24 గంటల్లో 5.42 మిలియన్ వ్యూస్ ,  153.9 కే లైక్స్ లభించాయి. ది వారియర్ మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన రామ్మూవీ తో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి. ది వారియర్ మూవీ లో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. కృతి శెట్టి ఈ మూవీ లో రామ్ సరసన హీరోయిన్ గా నటించగా లింగుస్వామి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: