టాలీవుడ్ లో ఎన్నో రోజుల పాటు స్టార్ హీరోయిన్గా హవా నడిపించిన వారిలో హన్సిక కూడా ఒకరు అని చెప్పాలి. చిన్న వయసు లోనే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన హన్సిక తక్కువ సమయం లోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది అని చెప్పాలి. తన అందం అభినయం తో తెలుగు ప్రేక్షకులు అందరినీ కూడా కట్టి పడేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇక ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు లేక పోవడంతో అటు చిన్న హీరోల సినిమాల్లో కూడా నటించడానికి సిద్ధమవుతుంది.




 ఇకపోతే హన్సిక గురించి గత కొంత కాలం నుంచి ఒక వార్తా సోషల్ మీడియా లో తెగ హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. చిన్న వయసు లోనే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన హన్సిక ఇక త్వరగా పెరగడానికి ఇంజక్షన్లు తీసుకుంది అంటూ ఒక వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇలా ఇంజక్షన్ తీసుకోవడం కారణం గానే చిన్న పిల్లలా ఉన్న హన్సిక కాస్త ఇక స్టార్ హీరోయిన్గా పెద్ద వయసు అమ్మాయిగా మారిపోయిందని ఎంతోమంది విమర్శించడం మొదలుపెట్టారు. ఇకపోతే ఇటీవల ఇలాంటి ఆరోపణల గురించి స్వయంగా హన్సిక స్పందించింది.


 త్వరగా పెరగడానికి హన్సిక ఇంజక్షన్లు తీసుకుంది అంటూ వస్తున్న పుకార్ల గురించి స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇలా తాను ఇంజక్షన్లు తీసుకున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ హన్సిక స్పష్టం చేసింది. ఈరోజు వరకు కూడా ఒక సాధారణ ఇంజక్షన్ కూడా నేను తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇంజక్షన్ అంటేనే నాకు ఎంతో భయం అని తెలిపింది. సూది అంటే భయం ఉండడం వల్ల ఇప్పటివరకు ఒక్క టాటూ కూడా వేయించుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే సెలబ్రిటీ అవ్వడం వల్ల ఇలాంటి పుకార్లు వస్తున్నాయని.. వీటిని నేను పట్టించుకోను అంటూ హన్సిక కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: