నాగ చైతన్య ఎన్నో భారీ అంచనాలతో చేసిన కస్టడీ సినిమా కస్టడీ. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను చితూరు శ్రీనివాస్ నిర్మించారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తమిళంలో పర్వాలేదు అన్న టాక్ తెచ్చుకోగా తెలుగులో మాత్రం నిరాశపరచింది. అయితే ఈ సినిమాను కావాలని తెలుగు ఆడియన్స్ నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని అంటున్నారు. తమిళ దర్శకులు తెలుగులో సినిమాలు చేయడం ఆహ్వానించలేని ప్రేక్షకులు ఇలా చేస్తున్నారని అంటున్నారు.

అయితే అసలు విషయం అది కాదు సినిమాలో విషయం ఉంటే అది ఎవరు డైరెక్ట్ చేసినా చూస్తారు. కాబట్టి ఈ వార్తలన్నీ రూమర్స్ అనే చెప్పొచ్చు. అయితే నాగ చైతన్య కస్టడీ మరీ డిజాస్టర్ కాదు అలా అని సూపర్ హిట్ కూడా కాదు. సినిమా యూనిట్ మాత్రం ప్రాజెక్ట్ హిట్ గానే ప్రకటించుకున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమా ఎఫెక్ట్ నాగ చైతన్య ప్రస్తుతం చేస్తున్న మరో సినిమాపై పడింది. విక్రం కె కుమార్ డైరెక్షన్ లో నాగ చైతన్య చేస్తున్న వెబ్ సీరీస్ ధూత. అమేజాన్ ప్రైం కోసం ఈ వెబ్ సీరీస్ చేస్తున్నారు.

కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సీరీస్ లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. విక్రం కుమార్ తో మనం, థాంక్యూ సినిమాలు చేసిన నాగ చైతన్య థాంక్యూతో ఫ్లాప్ అందుకున్నాడు. ఇక మరోపక్క ధూత ప్రాజెక్ట్ మీద కూడా నాగ చైతన్య అంతగా ఆసక్తి లేదని తెలుస్తుంది. కస్టడీ నిరాశపరచడంతో నాగ చైతన్య డిజపాయింటెడ్ గా ఉన్నారని ధూత వెబ్ సీరీస్ ని పక్కన పెట్టేశాడని అంటున్నారు. మరి అసలు విషయం ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. ధూత వెబ్ సీరీస్ ఆల్రెడీ పూర్తైందని త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా నాగ చైతన్యకు కస్టడీ రిజల్ట్ అసంతృప్తి పరచిందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: