మెగా డాటర్ నిహారిక కొణిదెల అందరికీ సుపరిచింతమే. యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఒక మనసు సినిమాలో హీరోయిన్గా నటించింది. పెళ్లి తర్వాత యాక్టింగ్ మానేసిన ఈమె మళ్ళీ ఇప్పుడు  హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అయితే కొంతకాలంగా విడాకులకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. నిహారిక భర్త చైతన్యతో గత కొంతకాలంగా దూరంగా ఉంటుంది. అంతేకాదు త్వరలో విడాకులు కూడా తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని.. 

దీంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అంతేగాక దీనికి తోడు ఇన్స్టాగ్రామ్ లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అంతేకాదు పెళ్లికి సంబంధించిన ఫోటోలు అన్నిటిని కూడా డిలీట్ చేశారు. దీంతో పరోక్షంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని హిట్ ఇచ్చినట్లుగా వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే తాజాగా ఈ ప్రశ్న నిహారిక ఎదురయింది. ఇక ఆమె నటించిన డెడ్ ఫిక్సల్స్ ప్రమోషన్ లో భాగంగా ఒక జర్నలిస్టు నిహారికను ఇదే ప్రశ్న అడిగారు. మీరు భర్తతో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ చాలా కాలంగా వాడితో వినిపిస్తున్నాయి.

దీనిపై మీరు ఏమంటారు అంటూ నిహారికను అడిగాడు. సున్నితంగా ఆ ప్రశ్నను దాటేసింది నిహారిక. సమాధానం చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. దీంతో నిహారిక విడాకులకు సంబంధించిన రూమర్స్ నిజమే అంటూ ఇప్పుడు మళ్లీ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిహారిక తన విడాకులు రూమర్స్ పై స్పందించలేకపోవడంతో నిజంగానే వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుపోతున్నారు అని అంటున్నారు. ఇంకా ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేవరకు వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకుంటారు లేదా అన్నది చూడాలి. ఇప్పుడు నిహరి విడాకులకు సంబంధించిన వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: