తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటి మనుల్లో మంచు లక్ష్మి ఒకరు. ఈ నటి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన టాలెంట్ తో ఎన్నో సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఈ నటి ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ లలో ... అలాగే ఎన్నో టాక్ షో లకు కూడా హోస్ట్ గా వ్యవహరించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం కూడా ఈనటి అనేక సినిమాల్లో నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈమె సిద్ధార్థ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందిన అనగనగా ఓ ధీరుడు అనే సినిమాలో ప్రతి నాయక పాత్రలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా లక్ష్మి కి మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరీర్లు ముందుకు సాగిస్తున్న లక్ష్మి చాలా సంవత్సరాల క్రితమే యాండీ శ్రీనివాసన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మంచు లక్ష్మి కి పెళ్లి అయినప్పటికీ భర్తతో ఎక్కువ సందర్భాలలో కనిపించకపోవడంతో ఇదే విషయంపై ఎన్నో వార్తలు బయటకి అనేక సందర్భాలలో వచ్చాయి.

తాజాగా ఈ వార్తలపై మంచు లక్ష్మి స్పందించింది. మంచు లక్ష్మి తాజాగా తన భర్తతో కలిసి ఉండకపోవడంపై స్పందిస్తూ ... నా భర్తతో నేను కలిసి ఉండడం లేదు అని వస్తున్న వార్తలు నా వరకు వచ్చాయి. నా భర్త అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. చాలా సంవత్సరాలుగా ఆయన అమెరికా లోనే పని చేస్తున్నాడు. నేను కూడా కొంత కాలం పాటు ఆయనతో ఉన్నాను. ఆయనతో ఉన్న సమయం లో నాకు ఏ పని లేదు. దానితో నా దగ్గర డబ్బులు కూడా ఎక్కువగా ఉండేవి కాదు.

దానితో నేను చాలా సమస్యలను కూడా ఎదుర్కొన్నాను. అదే విషయాన్ని ఆయనకు చెప్పాను. దానితో నా భర్త నీకు ఏ పని ఇష్టమో ఆ పని చెయ్యి ... నీకు సినిమాలు అంటే ఇష్టం ... నువ్వు చాలా సంతోషంగా ఇండియాకు వెళ్లి సినిమాలు చేసుకో. నీకు సినిమాల మధ్య గ్యాప్ వచ్చినప్పుడు ఇక్కడికి రా ... మనిద్దరం కలిసి సంతోషంగా ఉందాం అని చెప్పి నన్ను ఇండియా కి పంపించాడు. ఇలా మా ఇద్దరి మధ్య ఇంత క్లోజ్ రిలేషన్ షిప్ ఉంది అలాగే మా ఇద్దరికీ మధ్య ఫుల్ ఫ్రీడమ్ కూడా ఉంది అలాంటి సమయంలో నేను ఇతరుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము ఇద్దరం ఎందుకు కలిసి ఉండడం లేదో మాకు మాత్రం తెలిస్తే చాలు అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: