
అయితే భవిష్యత్తులో రాబోయే రీ రిలీజ్ సినిమాల విషయానికి వస్తే.. అందుతున్న సమాచారం మేరకు.. మహేష్ బాబు పూరి కాంబినేషన్లో వచ్చిన.. బిజినెస్ మాన్.. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా.. అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య సినిమా.. రాజమౌళి హీరో ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన చత్రపతి సినిమా రాబోయే రోజుల్లో సినిమాలుగా వచ్చే అవకాశం ఉన్నట్లు కొంతమంది సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు అభిమానులు ఈ చిత్రాలకు మక్కువ చూపుతారు చూడాలి మరి.
అయితే ఇక్కడ గమనించేదగ్గ విషయం ఏమిటంటే ఈ సినిమాలన్నీ కూడా ఈ హీరోల కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలన్నీ కూడా హీరోలకు మంచి క్రియేట్ తెచ్చి పెట్టడమే కాకుండా స్టార్ హీరోలుగా పేరు సంపాదించేలా చేశాయి. ఇప్పటివరకు హీరోల పుట్టినరోజున సందర్భంగా రీ రిలీజ్ చిత్రాలను విడుదల చేయడం జరిగింది. మరి ఈ చిత్రాలను ఎప్పుడు విడుదల చేస్తారు చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.