
ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో ఆమె బాగా బిజీగా ఉంది. అయితే రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు తెలిపింది.. తను ఫుడ్ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉండటమే కాకుండా మంచి డైట్ ఫాలో అవుతానని తెలిపింది. అయితే ఆమె తీసుకునే ఎటువంటి డైట్ లోనైనా తనకు కచ్చితంగా కాఫీ మాత్రం ఉండాల్సిందేనట. భోజనం స్కిప్ చేస్తే మాత్రం రెండు కాఫీలు తాగుతుందట.ఇక సినిమాలలో ఎటువంటి పాత్రలోనైనా చేస్తుందట. కానీ రోలర్ కోస్టర్ కనుక ఉంటే మాత్రం అస్సలు చేయదట. ఆ సన్నివేశం ఉందంటే ఆమె చాలా చచ్చిన చేయదట.. తనకు రోలర్ కోస్టర్ అంటే భయమని.. అవసరమైతే ఆ సినిమాను కూడా వదులుకుంటుందట. కానీ ఆ సీన్ మాత్రం అస్సలు చేయదని చెప్పుకొచ్చింది.మామూలుగా కొంతమందికి రోలర్ కోస్టర్ అంటే బాగా భయం వేస్తూ ఉంటుంది. అది చూడటానికి కూడా అందరూ చాలా భయపడుతూ ఉంటారు. తమన్నాకు కూడా అదంటే చాలా భయం అని తాజాగా తెలిసింది. ఇదంతా పక్కన పెడితే తమన్నా ఈ మధ్య వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా మారింది.అదేంటంటే తను బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది అని కొన్ని రోజుల నుండి జోరుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా వీరికి సంబంధించిన ఫోటోలు కూడా బాగా లీక్ అవుతున్నాయి.ఇక వీరి మధ్య నిజంగా లవ్ ఉందా అని అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ జనాలు.కానీ ఈ సంగతి గురించి తమన్నా మాత్రం ఇక్కడ అస్సలు స్పందించడం లేదు.