తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడిగా , నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటువంటి బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఆంజనేయులు మూవీ తో నిర్మాతగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. అందులో భాగంగా అనేక భారీ బడ్జెట్ సినిమాలను స్టార్ హీరోలతో నిర్మించి అతి తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

నిర్మాత ఆఖరుగా టెంపర్ అనే మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్మూవీ లో హీరో గా నటించగా ... పూరీ జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. కొంత కాలం క్రితం బండ్ల గణేష్ "డేగల బాబ్జి" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే బండ్ల గణేష్ ... పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో భాగంగా ఎన్నో ఫంక్షన్ లలో పవన్ ను దేవర అని కూడా బండ్ల గణేష్ సంబోధించాడు.

అలాగే దేవర అనే టైటిల్ తో పవన్ తో ఒక మూవీ కూడా చేయబోతున్నట్లు ప్రకటించాడు. కాకపోతే ఈ టైటిల్ ను ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయడం ఈ నిర్మాత మర్చిపోయాడు. దానితో జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు దేవర అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. బండ్ల గణేష్ చేసిన ఈ మిస్టేక్ ఎన్టీఆర్ కు బాగా కలిసొచ్చినట్లుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: