కోలీవుడ్ స్టార్ హీరో తరపతి విజయ్ ఇటీవల వారసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఇక ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలో ఒకటిగానే వచ్చింది. దీంతో ప్రేక్షకుల్లో ఆయన నటించబోయే తదుపరి సినిమాలపై ఆసక్తి మరింత ఎక్కువైంది. ఇప్పటికే లోకేష్ కనగరాజు దర్శకత్వంలో లియో సినిమాలో చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభూ దర్శకత్వంలో మరొక ప్రాజెక్ట్ ఓకే చేశారు. ఇటీవల దానికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. తలపతి 68 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. 

అయితే ఈ సినిమాకు సంబంధించిన వీడియోను కనుక మనం గమనిస్తే హీరో దర్శకుడు నిర్మాత పేర్లను పజిల్ రూపంలో చూపించడం జరిగింది. పేపర్ పజిల్ లో అక్షరాలను ఒక్కొక్కటిగా జరిచేస్తూ పేర్లు వచ్చేలా రౌండ్ చేయడం మనం చూడవచ్చు. తలపతి విజయ్ అని వెంకట ప్రభువు అని దర్శకుల పేర్లు వచ్చేలా చూపించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇలా వార్తలు రావడానికి ఒక కారణం కూడా ఉంది. విడుదలైన వీడియో చూస్తే  విజయ్ పేరు పక్కన ఎన్టీఆర్ అనే  ఆంగ్ల అక్షరాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి .

దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఆ వీడియోని చూసిన నెటిజన్స్ సైతం విజయ్ పేరుతో పాటు ఎన్టీఆర్ పేరు కూడా రౌండప్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటించబోతున్నారు అన్న ప్రచారం జరుగుతుంది. ఏదో పొరపాటున జరిగింది కాదని మేకర్స్ పొరపాటున ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారని తాము అనుకోవడం లేదని అంటున్నారు.  ఏదేమైనా విజయ్ సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు అన్న వార్త విన్న అభిమానులు ఎంతో ఆత్రుతగా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో నిజంగా సినిమా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఇక ఈ విషయంపై మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అధికారికి ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు వీరి ఫ్యాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: