యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో చాలా పెరిగి పోయింది. అలా ఈ సంఖ్య పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఇప్పటికే ఎంతో మంది యూట్యూబ్ ప్లాట్ ఫామ్ ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకోవడమే. ఇది ఇలా ఉంటే ఈ కోవాలోనే మరో యూట్యూబర్ నటుడు కూడా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు అతనే సుమంత్ ప్రభాస్. ఇప్పటికే ఈ నటుడు ఎన్నో యూట్యూబ్ వీడియోలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

తాజాగా ఈ నటుడు మేము ఫేమస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. అలాగే ఈ మూవీ కి ఇతనే దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ తో ఈ నటుడు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా మే 26 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమాను టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి అల్లు అరవింద్ విడుదల చేయబోతున్నాడు. దీనితో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో థియేటర్ లు దొరికే అవకాశం కూడా చాలా వరకు ఉంది.

ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని విడుదల రోజు కొన్ని సెలెక్టివ్ థియేటర్ లలో 99 రూపాయలకే చూసే వెసులుబాటును చిత్ర బృందం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన మరిన్ని వివరాలను మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: