ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే దర్శకుడు త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం లో సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ఇక ఈ మూడు సినిమాలలో ఒకటైన అలా వైకుంఠపురం సినిమా అయితే ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాల్సిందే. అయితే తాజాగా వివిధ కాంబినేషన్లో నాలుగవ సినిమా కూడా రాబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. 

అయితే 2018 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ పై బన్నీ వాస్  ఆసక్తికరమైన కామెంట్లను చేయడం జరిగింది. అయితే పుష్పటు షూటింగ్ పూర్తయిన వెంటనే బన్నీ త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్ళిపోతుందని ఆయన  ప్రకటించేశారు. 2024లో ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా పూర్తవుతుందని చెప్పుకొచ్చాడు బన్నీ వాస్. ఇక ఈ సినిమాను గీత ఆర్ట్స్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతున్నట్లుగా కూడా ఆయన వెల్లడించారు. అంతేకాదు ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎమోషన్స్ కు మించి ఉండబోతుందని తెలుస్తోంది.

దీంతో ఈ వార్త విన్న బన్నీ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్న ఈ సినిమాని ఆయన 22వ సినిమా అని ప్రచారం జరుగుతుంది .ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పా 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది ఈ సినిమా .ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే .ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సీక్వెల్ కోసం పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు  బన్నీ ఫాన్స్.ఇక ఈ సీక్వెల్ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా మలయాళ నటుడు ఫాహద్ ఫాసిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కాగా పుష్పట్టు సినిమా డిసెంబర్లో విడుదల కాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: