ఉప్పెన అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే సెన్సేషనల్ విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. ఉప్పెన బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇక ఆ తర్వాత వరుసగా చాన్సులు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే కెరియర్ మొదట్లో వరుస విజయాలు అందుకున్న కృతి శెట్టి ఇక ఎప్పుడు మాత్రం సరైన హిట్టు ఖాతాలో వేసుకోలేక పోతుంది. గత కొంతకాలం నుంచి ఈ అమ్మడు చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్లాప్ గానే మిగిలిపోతుంది. ఇటీవల నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కస్టడీ  సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన నటించింది కృతి శెట్టి.  అయితే వీరిద్దరి కాంబినేషన్  మొదట బంగార్రాజు సినిమాలో కనిపించగా ఇక ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో కస్టడీ  సినిమా కూడా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ కస్టడీ సినిమా అటు అక్కినేని అభిమానులను కూడా మెప్పించలేకపోయింది అని చెప్పాలి. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా అటు డైరెక్టర్ వెంకట్ ప్రభు చేతికి దళపతి విజయ్ సినిమా వచ్చింది.


 ఈ సినిమాకు కస్టడీ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజాకి  స్వరాలు సమకూర్చేందుకు అవకాశం లభించింది. అంతే కాదు ఇక కస్టడీ హీరోయిన్ కృతి శెట్టి కి సైతం ఒక సూపర్ ఆఫర్ దక్కబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు  దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ కోసం కృతి శెట్టి ని తీసుకుందామని ఫిక్స్ అయిపోయాడు వెంకట్ ప్రభు. కృతి శెట్టి ఇక విజయ లాంటి స్టార్ హీరోతో చేస్తే కెరియర్ కాస్త పుంజుకుంటుంది అని తిని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. దీన్నిబట్టి కస్టడీ ఫ్లాప్ తో నష్టపోయింది అక్కినేని హీరో నాగచైతన్య అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: