తమిళ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో కార్తీ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఈ నటుడు కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తాను నటించిన ఎన్నో సినిమా లను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కార్తీ "జపాన్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

మూవీ కి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు  అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో సునీల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇది వరకు కార్తీ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఖైదీ మూవీ ని కూడా దీపావళి సందర్భంగా థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. కార్తి ఆఖరుగా సర్దార్ అనే స్పై యాక్షన్ ధ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు.

సినిమా కూడా దీపావళి సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటికే కెరియర్ లో రెండు సార్లు దీపావళి సందర్భంగా తన సినిమాలను విడుదల చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్న కార్తి "జపాన్" మూవీ ని కూడా దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నాడు. మరి ఈ సారి కూడా ఈ హీరో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: