నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటించబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే ఈ సినిమా టైటిల్ మాత్రం ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. కేవలం NBK -108 అనే వర్కింగ్ టైటిల్ తోని ఈ సినిమాని రూపొందిస్తున్నారు.. అయితే ఈ సినిమాకు ఇప్పటికే పలు అప్డేట్ల వల్ల మంచి క్రేజ్ ఏర్పడింది.


అయితే ఈ ప్రాజెక్టు నుంచి ఇప్పటికి అనేక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి తాజాగా ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే ఈ సినిమా టైటిల్ "భగత్ కేసరి" అని ఫిక్స్ చేసినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఐ డోంట్ కేర్ అని ట్యాగ్ లైన్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ విషయం పైన చిత్ర బృందం ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. కానీ గతంలో ఈ సినిమా టైటిల్ ని బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ అన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి బ్రో అనే టైటిల్ ని ఫిక్స్ చేయడం జరిగింది.

బాలయ్య సినిమాకి భగత్ కేసరి ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ తో టైటిల్ ని రివిల్ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. జూన్ 10వ తేదీన బాలయ్య బర్త్ డే సందర్భంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా నటిస్తున్నారు. బాలయ్య ఈసారి కూడా సరికొత్త లుక్కులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. గత కొద్దిరోజులుగా సినిమా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా విజయదశమికి విడుదల చేయాలని చూస్తోంది ఈ సినిమా కూడా రివేంజ్ డ్రామాగా , వినోదాన్ని మించి భారీ యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని  టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: