నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించాడు. అలా బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో నరసింహ నాయుడు సినిమా ఒకటి. ఈ సినిమా 2001 వ సంవత్సరం విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ కి యాక్షన్ సినిమా లను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయినటువంటి బి గోపాల్ దర్శకత్వం వహించగా ... సిమ్రాన్ , ప్రీతి జింగ్యాని ఈ మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ లుగా నటించారు. 

మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ విజయం లో మణిశర్మ అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ లోని నటనకు గాను బాలకృష్ణ కు సిమ్రాన్ కు , ప్రీతి జింగ్యాని కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచి కలెక్షన్ ల వర్షం కురిపించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ఫుల్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

అందులో భాగంగా ఇప్పటికే బాలకృష్ణ హీరోగా రూపొందిన చెన్న కేశవ రెడ్డి సినిమా కూడా రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం జూన్ 10 వ తేదీన బాలకృష్ణ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన నరసింహ నాయుడు సినిమాను థియేటర్ లలో రీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో వెలవడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: