దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మోడీ సర్కార్ కు సరికొత్త పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు బంగారు భవిష్యత్తును తీసుకురావడం జరుగుతుంది. ఇక అమ్మాయిల రక్షణ, భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టిన పథకాలు అన్నింటికీ కూడా ప్రజల నుంచి మంచి స్పందన లభించడం గమనార్హం . ఇకపోతే ఆర్థికంగా ఎదగడానికి మోడీ ప్రభుత్వం పలు రకాల సేవలను అందుబాటులోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో అలాంటి పథకాలలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కూడా ఒకటి.


ఇక ఈ పథకాన్ని 2014 ఆగస్టు 28వ తేదీన అమలులోకి తీసుకు వచ్చిన మోడీ సర్కార్ ఈ పథకం కింద లబ్ధిదారులు పోస్టాఫీసులు , ప్రభుత్వ , ప్రైవేటు బ్యాంకులలో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేయించి వారికి అన్ని విధాలా ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఇకపోతే ఈ ఖాతాల్లో మినిమం బాలన్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. జన్ ధన్ యోజన ఖాతాలను ప్రభుత్వ పథకాలకు లింక్ చేసి లబ్ధిదారులకు నేరుగా డబ్బును జమ  చేస్తోంది మోడీ సర్కార్. అంతేకాదు ఈ పథకం వల్ల మరి ఎన్నో లాభాలు ఉన్నాయి అని కూడా చెబుతున్నాడు. మీ ఖాతాలో ఒక రూపాయి లేకపోయినా సరే పదివేల వరకు మీరు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది మోడీ సర్కార్.

కాకపోతే జన్ ధన్ ఖాతా అకౌంట్ తెరిచిన వారికి రూపే డెబిట్ కార్డు సౌకర్యం కల్పిస్తారు చేసుకోవచ్చు. కొనుగోలు చేసుకోవడానికి కూడా ఈ కార్డు పనికోస్తుంది. ఇక ఈ జన్ ధన్ యోజన పథకం కింద సుమారుగా పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై కూడా ఖాతా తెరవవచ్చు . ముఖ్యంగా ఈ పథకం ద్వారా రెండు లక్షల ప్రమాద భీమా 30000 జీవిత బీమా పొందవచ్చు అంతేకాదు మీరు డిపాజిట్ చేసిన మొత్తంతో పదివేల ఓవర్ డ్రాఫ్టు సౌకర్యం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: