కృషి , పట్టుదల ఉంటే లింగం తో పనిలేదు అని ఎవరైనా సరే విజయం సాధించవచ్చు అని ఇటీవల ఎంతో మంది మహిళలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక దేశంలో మహిళా సాధికారత పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాపారంతో పాటు సొంతంగా వ్యవసాయం చేయడానికి కూడా చాలా మంది మహిళలు ముందడుగు వేస్తున్నారు. ఇక ఆయా రంగాలలో పురుషులకు సమానంగా రాణిస్తూ సత్తా చాటుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలు తమ తెలివితో వ్యవసాయంలో కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. అంతేకాదు సరికొత్త రికార్డులను సైతం సృష్టించడం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన 20 స్టార్టప్ లను విజయవంతంగా నడుపుతూ ముందుకు వెళ్లడం గమనార్హం. ముఖ్యంగా అందులో ఐదు సేంద్రియ వ్యవసాయం.. రెండు డెయిరీలు,  పదమూడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సికార్ జిల్లాకు చెందిన సంతోష్ కేదార్ అనే ఒక మహిళా రైతు దానిమ్మ సాగులో ప్రత్యేకత చూపించింది. నిజానికి ఆమె భర్త హోంగార్డుగా పని చేసేవారు. ఇక దానిమ్మ తోట నాటాలని ఆలోచన అతడికి వచ్చింది. దీంతో వారు ఈ సాగును వెంటనే ప్రారంభించడం కూడా జరిగింది. దానిమ్మ మొక్కలు నాటిన తర్వాత మొదటి పంట రావడానికి సుమారుగా మూడు సంవత్సరాల కాలం పట్టింది . ఇక ఈ పంట ద్వారా ఏడాదికి ఎంత ఆదాయం వస్తుందో కూడా ఆమెకు తెలియదు. కానీ చివరికి వారి కష్టానికి తగిన ఫలితం దక్కడంతో వారి ఆదాయం కూడా బాగా రెట్టింపు  అవడం గమనార్హం.

ఇకపోతే దానిమ్మ చెట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో వీరు నిమ్మ , జామ మొక్కలు కూడా నాటారు. ఇక ప్రయోగం కూడా విజయవంతమై ఏడాదికి పది లక్షల రూపాయల ఆదాయం కూడా దాటింది. మొత్తంగా అటు ఇటు సంవత్సరానికి 30 లక్షల రూపాయల ఆదాయం ఆమె పొందుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: