నిజానికి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం అనేది రిస్క్ తో కూడుకున్న పని. కానీ కొద్దిగా ధైర్యం చేసి మీ దగ్గర ఉండే ఎక్స్ట్రా డబ్బులు కొంత మొత్తం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడుల వలన కచ్చితంగా కోట్ల రూపాయల లాభం వచ్చే అవకాశం అయితే ఉందని.. ఇటీవల కొన్ని రకాల కంపెనీ షేర్ మార్కెట్ నిరూపిస్తోంది. ఇక ఈ క్రమంలోని గతంలో ఒక్కొక్క షేర్ విలువ పది రూపాయలతో కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం 9 కోట్ల రూపాయల లాభం పొంది.. హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇంత అమౌంట్ ఒకేసారి చూసి వారి ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. నిజానికి దీర్ఘకాలంలో పెట్టుబడిదారులను లక్షాధికారులు చేసే కంపెనీలు ఎన్నో ఉన్నాయి. అందులో సెరా శానిటరీ కూడా ఒకటి.


ప్రముఖ పెట్టుబడిదారు విజయ్ కేడియా కి కూడా ఈ కంపెనీలో వాటా ఉంది. 20 సంవత్సరాలలో ఈ స్టాకు పది రూపాయల నుంచి రూ.4,733 కి చేరుకుంది. ఇక ఈ కాలంలో తమ ఇన్వెస్టర్లకు ఏకంగా రూ.4,733 కి చేరుకుంది. ఇక ఈ కాలంలో తన ఇన్వెస్టర్లకు 47,150 శాతం రాబడిని తీసుకొచ్చింది. గత ఐదు సంవత్సరాలలో ఈ స్టాకు ధర రూ. 2,735 నుంచి రూ.4,733 కి చేరుకుంది. అయితే పోయిన ఏడాదికాలంగా ఈ షేర్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటుంది అయినప్పటికీ కూడా 10 సంవత్సరాలలో ఇన్వెస్టర్లకు 1,475 రాబడిని అందించి రికార్డు సృష్టించింది. గత 10 సంవత్సరాలలో సెర శానిటరీ వేర్  షేర్ ధర రూ.300 నుంచి రూ.4,275 కి పెరిగింది. 20 సంవత్సరాల క్రితం ఒక్క షేర్ ధర రూ.10 మాత్రమే కానీ ఇప్పుడు దాని విలువ రూ.5000కు చేరుకుంది.


ఇదే 20 సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే. దాని విలువ ఇప్పుడు రూ.9.44 కోట్ల రూపాయలకు చేరుకునేది. దీన్ని బట్టి చూస్తే దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా కచ్చితంగా షేర్ మార్కెట్లో కోటీశ్వరులు అవ్వచ్చు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: