ఎవరైనా సరే ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటే ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలు ఉద్యోగాలు చేసి కొంతమంది విసిగిపోతే మరికొంతమంది ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడొక చిన్న బిజినెస్ ఐడియాను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే వ్యాపారం చేయాలి అంటే లక్షల్లో కూడుకున్న పని అని, అంత డబ్బు తమ దగ్గర లేదు అని ఆలోచించేవారు కూడా ఉంటారు. అందుకే ఒకసారి మీరు వ్యాపారం చేయాలని ఫిక్స్ అయితే చాలు మీ పెట్టుబడి కోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.

పదివేల తో కూడా మీరు బిజినెస్ మొదలు పెట్టవచ్చు. నాణ్యత కలిగిన ఉత్పత్తులు మీ సొంతం అయితే లాభం కూడా మీకే లభిస్తుంది. ఈరోజు పదివేల రూపాయల పెట్టుబడితో చెయ్యదగ్గ బిజినెస్లలో కేటరింగ్ మొదటి స్థానంలో ఉంది మారిన ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న ఫంక్షన్లకు అయినా సరే క్యాటరింగ్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అసలు మనకు టెన్షన్ లేకుండా ఉండాలి అంటే క్యాటరింగ్ సర్వీస్ కి అప్పగించడమే బెటర్ రేంజ్ లో ఆలోచిస్తున్నారు ప్రజలు. అందుకే ప్రతి ఒక్కరు కూడా క్యాటరింగ్ సర్వీస్ కే మొగ్గు చూపుతున్నారు.

మనకు ప్లేట్ కి చెప్పిన ఐటమ్స్ ని బట్టి ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే దీనిని బిజినెస్ గా ఎంచుకొని మంచి లాభాలు పొందవచ్చు. కేవలం 10000 రూపాయలకు ఈ వ్యాపారాన్ని ప్రారంభించి తక్కువ ఖర్చుతో ఉద్యోగం కోసం బదులు సొంత వ్యాపారం చేయడం బెటర్ అని నిరూపిస్తుంది ఈ వ్యాపారం . 50 వేల రూపాయల వరకు ఈ బిజినెస్ లో సంపాదించవచ్చు అయితే వ్యాపారం పెరిగే కొద్దీ పెట్టుబడి పెరిగినా..  ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక మీతో పాటు నలుగురికి మీరు ఆర్థిక సహాయం కూడా అందించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: