ప్రస్తుతం అన్ని భాషల్లోకెల్లా మల్టీ స్టారర్ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంది.. అందరి కన్ను రాజమౌళి RRR పై పడింది.. ఈ సినిమాలో ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు నటిస్తుండడంతో సినిమా పై అందరు హీరోల అభిమానులు అంచనాలు పెంచుకున్నారు.. ఇక ఇదే తరహాలో వంశి పైడిపల్లి ఓ భారీ మల్టీ స్టారర్ కు ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇప్పటికే మహర్షి సినిమా తో మంచి హిట్ కొట్టిన వంశి మహేష్ బాబు తో మళ్ళీ సినిమా చేయనుండగా అది మల్టీ స్టారర్ అని తెలుస్తుంది.. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించబోతున్నాడని తెలుస్తుంది.