రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. అందులో మొదటిగా వస్తున్నది దిల్ రాజు నిర్మాత గా రాబోతున్న వకీల్ సాబ్ అనే సినిమా.. వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు.. గతంలో ఓ మై ఫ్రెండ్ సినిమా తో దర్శకుడిగా పరిచయమైనా వేణు ఆతర్వాత రవితేజ తో ఓ సినిమా ప్లాన్ చేసినా అది వర్క్ అవుట్ కాలేదు.. దాంతో కొంత టైం తీసుకుని బాలీవుడ్ లోని పింక్ సినిమా తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు..