పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నాడు.. వకీల్ సాబ్ సినిమా ని ఆల్రెడీ రిలీజ్ కి సిద్ధం చేసిన పవన్ మిగితా సినిమాలను ఇంకా మొదలుపెట్టలేదు.. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పిరియాడికల్ సినిమా కి ఇంకొంత టైం పట్టేలా ఉంది.. హరీష్ శంకర్ సినిమా ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించట్లేదు.. దాంతో పవన్ ఫోకస్ మొత్తం వకీల్ సాబ్ మీదే ఉన్నట్లు అర్థమవుతుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ని వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా కి ఇది రీమేక్ కాగ పవన్ హీరోయిజానికి తగ్గట్లు స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఈ సినిమా ని రూపొందిస్తున్నారు..