టాలీవుడ్ లో ప్రస్తుతం త్రివిక్రమ్ కి మంచి డిమాండ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి హీరో ఈ దర్శకుడి కోసం పోటీ పడుతున్నాడు.. ఒక్కసారి సినిమా చేసిన వాళ్ళు కూడా త్రివిక్రమ్ తో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నారు అంటే హీరోలకు ఎంత ఫ్రీడమ్ ఇస్తాడో అర్థం చేసుకోవచ్చు.. పైగా హిట్ లు కూడా ఇస్తుండడంతో త్రివిక్రమ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. తన సినిమాల్లో చేసిన ఏ హీరో అయినా ఒక మెట్టు పైకి ఎక్కుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. స్టార్ డమ్ ని కూడా అమాంతం పెంచేలా చేస్తాడు త్రివిక్రమ్..