ప్రభాస్ బాహుబలి సినిమా తో దేశమంతటా ఎంత పాపులర్ అయ్యాడో అందరికి తెలిసిందే.. ఈ సినిమా తో టాలీవుడ్ మార్కెట్ ని వేల కోట్లకు తీసుకెళ్లిన ఘనత ప్రభాస్ ది అని చెప్పాలి.. ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందనడంతో భారీ బడ్జెట్ పెట్టి ప్రభాస్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.. సాహో బడ్జెట్ కూడా వంద కోట్లు దాటింది.. ఆ సినిమా ఫెయిల్యూర్ అయినా కలెక్షన్ లు ఏమాత్రం తగ్గలేదు అంటే ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.. సాహో సినిమా పరాజయం తర్వాత తాను చేయబోయే సినిమా లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు..బడ్జెట్ ఒక్కటే కాదు సినిమా లో మ్యాటర్ ఉండాలని ప్రభాస్ ఆలోచన.. అందుకే సాహో విషయంలో చేసిన పొరపాట్లను మళ్ళీ పునరావృతం అయ్యేలా చేసుకోకూడదు అని భావిస్తున్నారు..