బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న RRR సినిమాపై ప్రేక్షకులు భారీగానే ఆశలు అంచనాలు పెంచుకున్నారు.. టాలీవుడ్ లో రాజమౌళి కి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదంటే తన సినిమాలను ఎలా తెస్తాడో అర్థం చేసుకోవచ్చు.. బాహుబలి తో అయన పేరు ఎంతలా వెలిగిపోయిందో ప్రేత్యకంగా చెప్పనవసరం లేదు.. అందుకే ఆయన్ని టాలీవుడ్ జక్కన్న అని కూడా అంటారు. టాలీవుడ్ కి వచ్చి దాదాపు ఇరవై ఏళ్ళు అయినా పదికి పైగా సినిమాలు చేసినా ఆయనకు ఒక్క రిమార్క్ గానీ, ఫ్లాప్ రాలేదంటే అయన కు సినిమా పట్ల ఉన్న అంకిత భావం చెప్పనవసరం లేదు.. ఒక్కో సినిమా తో హిట్ కొట్టడమే కాదు టాలీవుడ్ స్థాయిని మార్చాడు. టాలీవుడ్ పేరు ను దేశమంతటా వినిపించిన ఘనత ఆయనది..బాలీవుడ్ లో రాజమౌళికి బ్రహ్మరథం పట్టారు..