దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం RRR .. బాహుబలి లాంటి పెద్ద హిట్ తర్వాత ఏ సినిమా చేస్తాడు అన్న దానికి RRR సినిమా అనౌన్స్ మెంట్ అభిమానులకు పెద్ద పండగలాంటిదే.. తన సినిమాలను ఎంతో అద్భుతంగా చెక్కుతాడని ఆయనను టాలీవుడ్ జక్కన్న అని కూడా అంటారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. పిరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. చిత్రీకరణ చివరిదశకు వచ్చిందని సమాచారం.