టాలీవుడ్ లో దాదాపు సగం మంది టాప్ హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినవారే.. ఓ రకంగా టాలీవుడ్ లో మెగా కుటుంబం చేసే సినిమాలమీదే ఆధారపడి వందలాది మంది జీవనం కొనసాగిస్తున్నారని చెప్పాలి. మెగా స్టార్ చిరంజీవి దగ్గరినుంచి వైష్ణవ్ తేజ్ వరకు డజను మంది టాలీవుడ్ లో హీరోలుగా, వివిధ రకాల జాబ్స్ చేస్తూ ఉన్నారు.. హీరోల విషయానికొస్తే అందరు హీరోలు మంచి సినిమాలు చేస్తూ మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకుని దూసుకుపోతున్నారు. వరుస హిట్ సినిమాలు చేస్తూ మెగా ఫాన్స్ ని ఎంతగానో అలరిస్తున్నారు.