క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఫేమస్ అయిన శ్రీరెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా తమిళనాడు లో సెటిల్ అయ్యింది.. గత జీవితం తాలూకు ఫలితం ఎలాంటి ప్రభావాన్ని తనపై చూపించకూడదని తమిళనాడు లో ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని డబ్బు సంపాదన మొదలుపెట్టింది.. వెళ్లడం అయితే వెళ్ళింది కానీ శ్రీరెడ్డి టాలీవుడ్ సెలెబ్రిటీలను విమర్శించడం మాత్రం మానుకోలేదు.. టైం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ని, మెగా ఫ్యామిలీ ని విమర్శిస్తూ తన నోటికి పనిచెప్తూ మెగా ఫ్యాన్స్ నోటికి పని చెప్తుంది..ఇటీవల ఆచార్య టీజర్ గురించి కామెంట్స్ రచ్చకు దారితీశాయి.