మెగా ప్రిన్సెస్ నిహారిక నటించిన చిత్రం “ఒక మనసు”. ప్రస్తుతం ఈ మూవీ థియోటర్స్ లో హల్ చల్ చేస్తుంది. నాగబాబు కూతురు నిహారిక నటించిన ఈ చిత్రాన్ని చూసేందుకు మెగా ఫ్యాన్స్ థియోటర్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే నటనాపరంగా నిహారికకు “ఒక మనసు” మూవీ మొదటిది కాబట్టి, ఇందులో అంతగా చెప్పుకోదగ్గ యాక్టింగ్ ని నిహారిక చేయలేదు.


కానీ కొన్ని ఎక్స్ ప్రెషన్స్ ని మాత్రం నిహారికా చాలా బాగా ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే “ఒక మనసు”మూవీని చూసిన చిరంజీవి, నిహారికని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ప్రస్తుతం ఉన్న మెగాహీరోల కంటే నిహారికకు మంచి భవిష్యత్ ఉంటుంది, తను తన మొదటి మూవీని ఎంచుకున్న తీరే ఈ విషయాన్ని చెబుతుందని చెప్పుకొచ్చారు.


కథల విషయంలో నిహారికకు మంచి టేస్ట్ ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు. నిహారికా సైతం మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన కాంప్లిమెంట్స్ కి తెగ ఫిదా అవుతుంది. ఇక చిరంజీవి నటిస్తున్న కత్తిలాంటోడు చిత్రంలోనూ నిహారిక కొద్ది నిముషాల పాటు కనిపించనుందని అంటున్నారు. మొత్తంగా నిహారిక నటించిన మొదటి మూవీ “ఒక మనసు”, తనకి మంచి కాంప్లిమెంట్స్ ని ఇస్తుందని అంటున్నారు.


ఇక బాక్సాపీస్ పరంగా చూస్తే, ఈ మూవీ చెప్పుకోదగ్గ బిజినెస్ ని చేసింది. అలాగే కలెక్షన్స్ సైతం మొదటి వారంలో పర్వాలేదని పించాయి. ప్రస్తుతం “ఒక మనసు” మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నిహారికా, కొద్ది విరామం తరువాత తన రెండో మూవీకి సంబంధించిన విషయంపై ఓ నిర్ణయాన్ని తీసుకోనుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: