`మిస్ట‌ర్ పెళ్లికొడుకు` బోల్తా కొట్ట‌డంతో సునీల్ త‌న కెరీర్‌పై సీరియ‌స్‌గా దృష్టిపెట్టాడు. ఇక ముందు ఇలాంటి పొర‌పాట్లు జ‌ర‌క్కూడ‌ద‌ని భావిస్తున్నాడు. మ‌రోవైపు కామెడీ వేషాలు వేయ‌డానికి కూడా సిద్ధ‌మ‌వుతున్నాడు. నిన్నా మొన్న‌టి దాకా.. హాస్య‌న‌టుడిగా క‌నిపించ‌డానికి స‌సేమీరా అన్న సునీల్‌... ఇప్ప‌డు అందుకు సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించాడు. అవ‌స‌ర‌మైతే విల‌న్‌గానూ న‌టిస్తా అని చెబుతున్నాడు. ``నాకు ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాల‌ని వుంది. మంచి పాత్ర వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తా`` అని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. సిక్స్‌ప్యాక్ పెంచాడు క‌దా..? ఫైటింగుల‌కు ప‌క్కాగా స‌రిపోతాడ‌నే కాన్ఫిడెన్స్ వ‌చ్చిందేమో! లేదంటే హీరోగా ఎన్నాళ్లో ఉండలేం అనే నిజ‌మైనా తెలిసుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: