టైటిల్ కాస్త విచిత్రంగా ఉన్నా ఇక్కడ అసలు విషయం ఏంటంటే బాలీవుడ్ క్రేజీ హీరో వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న రణ్ వీర్ సింగ్ తనకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేలా వాణిజ్య ప్రకటనలు చేస్తూ వచ్చాడు. అయితే అందులో కండోం యాడ్ కూడా ఉంది. డ్యురెక్స్ కండోమ్స్ కు రణ్ వీర్ సింగ్ ప్రచారకర్తగా ఉన్నారు.     


అయితే ఇప్పుడు అది క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. రణ్ వీర్ కపూర్ కండోమ్స్ కు గుడ్ బై చెప్పడం అంటే డ్యురెక్స్ కండోం యాడ్ కు గుడ్ బై చెప్పాడన్నమాట. అంతేకాదు ఇకమీదట తాను మరే ఇతర కండోం బ్రాండ్స్ కు ప్రచారకర్తగా ఉండనని చెప్పాడు. దీపికాతో పెళ్లి తర్వాత రణ్ వీర్ చాలా మారిపోయాడు.      


తనకు వస్తున్న సినిమాలు చేస్తే చాలని అనుకున్నాడో ఏమో కాని రణ్ వీర్ సింగ్ యాడ్స్ లను తగ్గించుకోవాలని చూస్తున్నాడు. డ్యురెక్స్ కండోం వారితో అగ్రిమెంట్ పూర్తవడంతో ఇక అలాంటి యాడ్స్ కు ఇకమీదట కూడా సైన్ చేసే అవకాశం లేదని చెబుతున్నాడట రణ్ వీర్ సింగ్. ఓ పక్క దీపికాతో పర్సనల్ లైఫ్.. మరో పక్క సూపర్ సక్సెస్ ఫుల్ గా ఉన్న సిని కెరియర్ ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. 


ఎక్స్ ట్రా ఇన్ కమ్ కోసం వాణిజ్య ప్రకటనలు చేసినా వాటి వల్ల అనవసర తలనొప్పులు పెట్టుకున్నట్టే లెక్క. డ్యురెక్స్ కండోం వారు రణ్ వీర్, దీపికా వెడ్డింగ్ టైంలో కూడా దీనిపై ఓ రింగ్ ఉంచినందుకు అభినందనలు అంటూ సందడి చేశారు. మొత్తానికి రణ్ వీర్ కండోం యాడ్ క్యాన్సిల్ చేయడం అతని ఫ్యాన్స్ మాత్రమే కాదు దీపికా ఫ్యాన్స్ కూడా రిలాక్స్ అయ్యేలా చేసింది.     


మరింత సమాచారం తెలుసుకోండి: