సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన స్టార్ హీరో సినిమాలు విడుదలై ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీసు వద్ద వందల కోట్లల్లో డబ్బులను వసూలు చేస్తున్నాయని ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. కానీ వాస్తవానికి ఇవన్నీ తప్పుడు వార్తలని ఆ సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్లు చెబుతూ గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన దర్బార్ సినిమాని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు 'మేము మునిగిపోయాం ప్రభూ' అంటూ రజినీకాంత్ ని, దర్శకుడు మురగదాస్ ని, ఇంకా లైకా ప్రొడక్షన్స్ సంస్థని సంప్రదించి నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రజినీకాంత్ లాంటి బడా హీరోల సినిమాల బడ్జెట్ రూ.100 కోట్లు ఉంటే.. వాటిని నాలుగైదు రెట్లు అనగా దాదాపు రూ.500కోట్ల వ్యయంతో డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేస్తారు. కానీ ఈ సినీ హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే.. డిస్ట్రిబ్యూటర్లు ఘోరంగా నష్టపోతారు. గతంలో రజనీకాంత్ సినిమా ఇదే తరహాలో అట్టర్ ఫ్లాప్ అయ్యి... డిస్టిబ్యూటర్ లకు ఎంతో నష్టం కలిగించింది. దీంతో వారంతా రజినీకాంత్ వద్దకు వెళ్లి తమ బాధను వెళ్లబోసుకొగా.. అతను కొంత డబ్బులు చెల్లించాడు. అయితే మళ్లీ రూ.200 కోట్ల బడ్జెట్ తో వచ్చిన రజనీకాంత్ దర్బార్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు రెట్టింపు డబ్బు పెట్టి కొనుక్కున్నారు. జనవరి 9వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా 4 వేల థియేటర్లలో రిలీజ్ అయినా ఈ సినిమా గతంలో లాగానే అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో కనీసం 70 శాతం కూడా వసూల్ కాలేదు.


అందుకే కొందరు దర్బార్ డిస్ట్రిబ్యూటర్లు తమకి చాలా కోట్ల నష్టం వచ్చిందని.. నష్టాన్ని భర్తీ చేయాలంటూ లైకా ప్రొడక్షన్స్ నిర్వాహకులను కలిస్తే... 'మాకు కూడా నష్టం వచ్చింది. మురగదాస్ రూ.60 కోట్లు, రజినీకాంత్ రూ. 40కోట్లు పారితోషికం తీసుకున్నారు. వెళ్లి వారిని అడగండి', అని వాళ్లు వెళ్లగొట్టారట. దీంతో వాళ్ల మురుగదాస్ వద్దకు వెళ్లగా... మురగదాస్ అల్లుఅర్జున్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారని తన సిబ్బంది డిస్ట్రిబ్యూటర్లని వెళ్లగొట్టారు. ఇక చివరికి చెన్నైలోని రజనీకాంత్ ఇంటికి చేరుకొని నష్టాన్ని భర్తీ చేయాలని కోరే సందర్భంలో మీడియా ఈ విషయాన్ని తెలుసుకొని వీళ్ళని ప్రశ్నించేందుకు ముందుకు రాగా.. తాము ఒకటి చెబితే వాళ్లు మరొకటి రాసి రజినీకాంత్ కి ఎక్కడా కోపం తెప్పిస్తారనే భయంతో, అక్కడి నుండి డిస్ట్రిబ్యూటర్లు పరారయ్యారట.

మరింత సమాచారం తెలుసుకోండి: