బ్రహ్మానందం... టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకున్న హాస్య నటుల్లో ఒకరు. తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకుని తెలుగు సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన నటుల్లో బ్రాహ్మీ ఒకరు. ఏ హీరో అయినా సరే బ్రాహ్మీ లేకుండా సినిమా లేదు అనేది వాస్తవం. దాదాపు మూడు దశాబ్దాల పాటు తన ఇమేజ్ తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు బ్రహ్మానందం. ఆయన కోసమే చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి వెళ్ళారు అంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.

 

అహ నా పెళ్ళంట సినిమాలో బ్రాహ్మీ కామెడి అలా నిలిచిపోయింది. ఆ సినిమాలో ఆయన కామెడి ఇప్పటి తరాన్ని కూడా ఊపేస్తుంది. ఆ సినిమాలో ఆయన లేకపోతే అసలు సినిమాకి అందం లేదు అనే విధంగా కామెంట్లు వచ్చాయి. కోటా పక్కన ఆయన కామెడి అలా నిలిచిపోయింది. ఇప్పటి తరం హీరోలు అయినా, అప్పటి తరం అయినా సరే.. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రవితేజా, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇలా ఎవరి సినిమా అయినా సరే ఆయన లేకుండా కామెడికి అర్ధం లేదు. 

 

పోకిరి సినిమాలో బ్రాహ్మీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఆయన నటన చాలా ఆకట్టుకుంది. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఒక ఊపు ఊపారు. బాద్షా సినిమాలో కూడా ఆయన నటనకు ఎక్కువ మార్కులు పడ్డాయి. కిక్ సినిమాలో, ఆంజనేయులు సినిమాలో ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. క్రియేటివ్ జీనియస్ ప్రభా హియర్ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ నవ్వు తెప్పిస్తాయి. ఎంత మంది హాస్య నటులు ఉన్నా సరే బ్రాహ్మీ ఎవర్ గ్రీన్ హాస్య నటుడు అనేది అక్షరాలా నిజం. ఆయన సినిమాలకు ప్రాణం పోసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: