టాలీవుడ్‌లో కంటెంట్ బేస్ చేసుకుని గ్రామ నాట‌కాలు చాలా త‌క్కువుగా వ‌స్తుంటాయి. గ‌తంలో ఈ త‌ర‌హా సినిమాలు వ‌చ్చేవి. ఇక ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత పలాస‌ 1978 అనే సినిమా వ‌చ్చింది. ఇక ముందు నుంచే మంచి హైప్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్ప‌టికే ప్రివ్యూలు కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా క‌థా ప‌రంగా చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో ప‌లాస అనే ప‌ట్ట‌ణంలో ఉన్నత కులాల వారికి, బడుగు బలహీన వర్గాలకి మధ్య ఉన్న విభేదాలను చెప్పే కథ. 

 

 
ప‌లాస అనే గ్రామంలో ఉన్న‌త కులాల వారితో పాటు దిగువ కులాల‌కు చెందిన వారు కూడా ఉంటారు. ఈ గ్రామంలో షావుకారు, అతని తమ్ముడు చిన్న షావుకారు(రఘు కుంచె) మధ్య పదవీ కోసం పెద్ద యుద్ధం న‌డుస్తోంది. ఈ యుద్ధంలో చిన్న షావు కారు ప‌ద‌వి కోసం అన్న‌నే చంపాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తాడు. ఈ క్ర‌మంలో షావుకారి భైరాగి అనే బలం ఉండడంతో ప్ర‌తి ప్ర‌య‌త్నంలో ఓడిపోతూ ఉంటాడు.


ఈ క్ర‌మంలోనే షావుకారుపై దిగువ జాతికి చెందిన జాన‌ప‌ద పాట‌లు పాడే మోహన రావు(మోహన్ రావు) – రంగ రావు(తిరువీర్) అనే అన్నదమ్ములు ఎదురు తిరిగి భైరాగిని చంపేస్తారు. ఈ క్ర‌మంలోనే చిన్న షావుకారు వాళ్ల స‌పోర్ట్‌తో అన్న‌పై గెలుస్తాడు. అక్కడి నుంచీ చిన్న షావుకారు ఆ అన్నదమ్ములను రౌడీలుగా ఎలా మార్చారు ?  వారిని ఎలా ?  వాడుకున్నాడు. చివ‌ర‌కు రౌడీలుగా మారిన ఈ అన్న‌ద‌మ్ముల క‌థ ?  ఎలా మ‌లుపులు తిరిగింది ?  అన్న‌దే ఈ సినిమా స్టోరీ.  ఫైన‌ల్‌గా ఉన్న‌త కులాలు... బ‌డుగు కులాల‌కు మ‌ధ్య ఏం జ‌రిగింది అన్న‌దే ఈ సినిమా క‌థ‌.


ఇక ఫైన‌ల్‌గా చెప్పాలంటే ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌దు. అయితే ఉత్త‌మ క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్కిన ఈ సినిమా మంచి స్క్రీన్ ప్లే కలిగి ఉండడంతో ప్రశంసించాల్సిన సినిమాగా నిలుస్తుంది. రోటీన్ స్టోరీ లైన్ అన్న‌ది ప‌క్క‌న పెడితే ఈ సినిమాలు తీసే వారు త‌క్కువై పోయారు. ఈ సినిమా డైరెక్ట‌ర్ కరుణ కుమార్‌ను ఖ‌చ్చితంగా ప్ర‌శంసించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: