ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ల హవా  ఎక్కువైపోతుంది అన్న విషయం తెలిసిందే. కొత్త కొత్త యాంకర్లు తెరమీదికి వస్తున్నారు. అయితే తమదైన వాక్చాతుర్యంతో ఓవైపు అందం తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో ముందు వరుసలో ఉంటుంది సుమా. సుమ బుల్లి తెరపై సందడి చేస్తుంది ఇప్పటినుంచి కాదు. దాదాపు దశాబ్ద కాలం నుంచి బుల్లితెరపై సుమ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకుల్లో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకుంది. ఒకప్పుడు సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన సుమ ఆ తర్వాత బుల్లితెరకు మాత్రమే పరిమితమైపోయింది. 

 

 

 సినిమాలలో రాణించిన అంతగా గుర్తింపు తెచ్చుకునేదో  లేదో తెలియదు కానీ బుల్లి తెరపై మాత్రం యాంకర్ సుమకు  ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. బుల్లితెరపై ఎంత మంది కొత్త యాంకర్స్ వచ్చిన... ఎంత వాక్చాతుర్యాన్ని ప్రదర్శించిన సుమ యాంకరింగ్ ముందు మాత్రం తేలిపోతూ ఉంటారు. ఇలా సుమ యాంకరింగ్ తో ఎన్నో సంచలనాలు సృష్టించింది అనే చెప్పాలి. ముఖ్యంగా సుమ మహిళా మణులు అందరికీ స్పెషల్ యాంకర్ గా మారిపోయింది. సుమ చేసే కార్యక్రమాలు అన్నీ మహిళ మణులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పట్టుకుంటే పట్టుచీర,  స్టార్ మహిళ లాంటి ప్రోగ్రాం లలో  అయితే మహిళను టీవీలకు అతుక్కుపోయే చేస్తాయి. 

 

 

 అయితే ఆ యాంకర్ సుమ ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ఇక పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సుమ అవకాశాలు దక్కించుకుంది. ఇక ఆ తర్వాత రాజీవ్ కనకాలను  ప్రేమించి కొన్నేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది సుమ. ఇక ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్గా అవతారమెత్తింది. అయితే సుమ సినిమాలకు గుడ్ బై చెప్పడానికి వెనక అసలు నిజం ఏమిటి అనేది ఇమంది రామారావు చెప్పుకొచ్చారు. సుమ ఎక్స్ట్రార్డినరీ టాలెంటెడ్ అయినప్పటికీ ఎక్స్ట్రార్డినరీ అందగత్తె కాదు అన్న విషయం సుమకి  తెలుసని ... అందుకే బుల్లితెరపై రాణించాలని నిర్ణయం తీసుకుందని... అంతే కాకుండా సినిమాల వల్ల తన దాంపత్య జీవితానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండదని దూరదృష్టి తో  బుల్లితెరపై యాంకర్గా అవతారమెత్తింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సుమ తీసుకున్న  ఆ ఒక్క నిర్ణయం ఆమె జీవితాన్నే మార్చేస్తుంది అంటూ ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: