సినిమాల్లో పంచ్ డైలాగులు కామన్ అన్న విషయం తెలిసిందే... ఇక కొంతమంది హీరోల సినిమాల్లో అయితే పంచ్ డైలాగ్లతో గడిచిపోతుంది సినిమా మొత్తం. అయితే సినిమాలో ఎన్ని పంచు డైలాగ్ లో ఉన్న ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పంచ్ డైలాగులు మాత్రం కొన్నే ఉంటాయి. అలా  ప్రేక్షకులకు కనెక్ట్ అయిన పంచు డైలాగులు వైరల్ గా మారిపోయి ట్రెండింగ్ గా మారుతుంటాయి. ఎవరి నోట చూసిన ఆ పంచు డైలాగే  వినిపిస్తూ ఉంటుంది. ఇక కొన్ని రోజుల వరకు ఆ పంచు డైలాగ్ మేనియా నడుస్తోంది. కేవలం హీరో కి సంబంధించిన అభిమానులే కాదు.. సినీ ప్రేక్షకులు అందరూ ఆ పంచ్  డైలాగ్ ఉపయోగిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ప్రభాస్ సినిమాలో ఎన్నో పంచు డైలాగులు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఎవర్గ్రీన్ గా నిలిచింది. 

 

 ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి అంటారా... వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు... అంటూ ప్రభాస్ క్యూట్ గా  చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఎవర్గ్రీన్ పంచు డైలాగ్ గానే మిగిలిపోయింది. ఇక మిర్చి సినిమా విడుదలైన చాలా రోజుల పాటు ప్రతి ఒక్కరి నోటి లో ఈ డైలాగ్ వినిపించింది  అనే చెప్పాలి. ఇక మిర్చి సినిమా విడుదలైన కొన్ని రోజులపాటు ఈ డైలాగ్ ట్రెండింగ్ గా మారిపోయింది. అంతే కాకుండా అందరు సినీ ప్రేక్షకులు కూడా ఈ డైలాగ్ కి బాగా కనెక్ట్ అయి పోయారు. ముఖ్యంగా ఈ పంచు డైలాగ్ ఎక్కువగా ఎవరికి ఉపయోగపడింది అంటే... అది ప్రేమికులకి అని చెప్పాలి. 

 


 ఎందుకంటే తాము ప్రేమించి ప్రపోజ్ చేయాలనుకునే  అమ్మాయిల వద్దకు వెళ్లి వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంటూ చెప్పడం ప్రారంభించారు చాలామంది. అంతేకాకుండా స్నేహితుల దగ్గర కూడా ఇలాంటి డైలాగ్ ఉపయోగించడం బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పిన డైలాగు మాత్రం ప్రేమికులకు బాగా ఉపయోగపడింది అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత ఈ సినిమాలో కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడు లేడు అంటూ రౌద్రంగా ప్రభాస్  చెప్పిన డైలాగ్ కూడా బాగా ఫేమస్ అయింది. ఇది కూడా మిర్చి సినిమా విడుదలైన చాలా రోజుల పాటు నిలిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: