తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు  స్టార్ హీరోయిన్గా కొనసాగి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ త్రిష కు ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ  ఎంత క్రేజ్ సంపాదించినప్పటికి త్రిష  క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో త్రిష తన అందం అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది అని చెప్పాలి. తన అందాలతో ఎంతోమంది మతి పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు తన హవాని అనిపించింది. 

 

 

 అయితే టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ త్రిషకి ఎక్కువగా గుర్తింపు రాలేదు. కానీ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన వర్షం సినిమా తో మాత్రం త్రిష క్రేజ్  ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పాలి. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించింది త్రిష. వర్షం సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్రలో నటించిన త్రిష తన నటనతో తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది అనే చెప్పాలి. ఇక వర్షం సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత మంచి విజయాన్ని అందుకుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఈ  సినిమా త్రిష కెరీర్ ను కీలక మలుపు తిప్పింది. 

 

 

 అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ త్రిష మధ్య జరిగే లవ్ స్టోరీ ఎంతో మందిని ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక వర్షం సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించిన త్రిషకు అవకాశాలు వరుస  రావడం మొదలెట్టాయి. వర్షం సినిమా తో దర్శక నిర్మాతలు అందరి చూపు ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో... ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్గా తన హవా నడిపించింది త్రిష.

మరింత సమాచారం తెలుసుకోండి: