తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.  ఆ చిత్రం పేరు ‘త‌లైవి’ అని కూడా పెట్టారు.  తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏ.ఎల్ విజయ్ అనే దర్శకుడు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. తెలుగు నిర్మాత విష్ణువర్థన్ ఇందూరి,  శైలేష్ ఆర్‌.సింగ్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్  ప్రారంభమై ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేసుకుంది. తళైవి జయలలిత పాత్ర‌లో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్న‌టిస్తుండగా ఈ సినిమాలో మరో కీలక పాత్ర అయిన లెజెండరీ త‌మిళ‌నాడు దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్ర‌న్ (MGR) పాత్ర‌లో సీనియర్ హీరో అర‌వింద‌ స్వామి న‌టిస్తున్నారు. 

 

విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు. కంగ‌నా ర‌నౌత్‌ని జ‌య‌ల‌లిత‌గా తీర్చిదిద్దేందుకు బ్లేడ్ ర‌న్న‌ర్‌, కెప్టెట్ మార్వ‌ల్ వంటి హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్టును రంగంలోకి దించారు. ఇక త‌లైవి ఫ‌స్ట్‌లుక్‌లో కంగ‌నా పాత్ర‌లో ఒదిగిపోయిన‌ట్లు క‌నిపించింది. ఇక కంగ‌న ఏద‌న్నా ఒక పాత్ర‌లో న‌టిస్తే ఆపాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా ఇమిడిపోవ‌డ‌మేకాక దాని కోసం ఎన్ని విద్య‌ల‌నన్నా నేర్చుకుంటది. ఇక ఇటీవ‌లె ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో కంగ‌న ఆ పాత్ర గురించి ఈ విధంగా తెలిపింది. జయలలిత అందచందాలపై కంగనా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. జయలలిత అంతటి అందం తనకు లేదని వ్యాఖ్యానించింది కంగనా. జయలలిత అందం బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ అందంతో సరిపోతుందని వ్యాఖ్యానించింది. జయలలిత అంతటి గ్లామర్ స్టార్ తాను కాదని...ఆమె పాత్రలో ఇమిడిపోవడం తనకు పెద్ద సవాలుగా చెప్పుకొచ్చింది.

 

తమ ఇద్దరి మధ్య మరో సారూప్యత కూడా ఉన్నట్లు వివరించింది కంగనా. సినీ నటిగా సంతృప్తి చెంది జీవితంలో గ్లామర్ డాల్‌గా మిగిలిపోవడం జయలలితకు ఇష్టంలేదని..అందుకే రాజకీయాల్లోకి ప్రవేశించారని చెప్పింది. తాను కూడా నటిగా మిగిలిపోకుండా...సినీ నిర్మాతగా తనను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఆ రకంగానూ ఇద్దరి మధ్య సారూప్యత ఉన్నట్లు వివరించింది. తలైవి చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశముంది. మ‌రి ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణం ఈ చిత్రం డేట్ ఏమ‌న్నా మారుతుందా లేదా అన్న విష‌యం తెలియాల్సి ఉంది. ఇక కంగ‌న ఎంత టాలెంటెడో గ‌తంలో ఆమె న‌టించిన రాణి రుద్ర‌మ‌దేవి చూస్తే త‌ను పాత్ర‌లో ఎంత‌గా ఒదిగిపోతుంది అన్న‌ది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: