రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ దర్శకత్వంలో 2007లో తెరకెక్కిన సినిమా యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రదీప్ రావత్, కోటశ్రీనివాసరావు విలన్స్ గా నటించగా, ప్రముఖ సీనియర్ నటి శారద, ప్రభాస్ కు తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో మెప్పించారు. అప్పటి కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి నిర్మాతగా ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమాలో యోగి అనే పవర్ఫుల్ పాత్రలో ప్రభాస్ నటన అద్భుతం అనే చెప్పాలి. ముందుగా అమాయకుడిగా అన్నిటికీ సర్దుకుని ఉండే హీరో, అనుకోకుండా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన రౌడీ గా మారుతాడు. 

IHG

తల్లిని వెతుకులాడుతూ కొడుకు, కొడుకుని వెతుకులాడుతూ తల్లి పడే ఆవేదన, మధ్యలో కొంత ప్రేమకథ, యాక్షన్, ఎమోషన్, కామెడీ, అదిరిపోయే ఫైట్స్ వంటి పలు అంశాలతో ఈ సినిమాని దర్శకుడు వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. అయితే అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్, రెండు సాంగ్స్, అదిరిపోయే ఫైట్స్, హృద్యంగా సాగే క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచాయి. ఇకపోతే ఈ సినిమా, వాస్తవానికి అంతకముందు 2005లో కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో వచ్చిన జోగి అనే సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కడం జరిగింది. 

 

ఇక యోగి రిలీజ్ తరువాత దాని ఫలితంతో సంబంధం లేకుండా ప్రభాస్ కు మాస్ లో మంచి పేరు, క్రేజ్ వచ్చాయి అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు ప్రఖ్యాత సంగీత దర్శకడు రమణగోగుల అందించిన సాంగ్స్ అన్ని బాగున్నప్పటికీ ముఖ్యంగా ఓరోరీయోగి, ఏ నోము నోచిందో వంటి సాంగ్స్ అప్పట్లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ విధంగా యోగి సినిమా ప్రభాస్ కెరీర్ లో ఒక ప్రత్యేక సినిమాగా నిలిచిపోతుందని చెప్పాలి.....!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: