తెలుగు చిత్ర పరిశ్రమలో నట వారసులుగా చాలా మంది నటులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాంటి కథానాయకుడే మన ప్రిన్స్ మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు చిన్నతనంలోనే తన తండ్రి తో పాటుగా 7 సినిమాలలో నటించాడు. 1991 లో వచ్చిన బాల చంద్రుడు సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఇక తర్వాత చదువు పూర్తి చేసే ఉద్దేశంతో నటనకు బ్రేక్ వేశాడు. తిరిగి హీరోగా రాజకుమారుడు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నంది అవార్డుని అందుకున్నాడు. 

 

రాజ కుమారుడు, వంశీ, యువరాజు, మురారి వంటి చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే 2003 లో వచ్చిన ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీలో అగ్ర హీరోగా నిలదొక్కుకున్నాడు. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైన్ గా తెరకెక్కిన ఒక్కడు సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. గుణ శేఖర్ దర్శకత్వంలో ఏం ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాలో మహేష్ కి జోడిగా భూమిక చావ్లా నటించింది. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా మహేష్ కెరీర్ పరంగా మంచి గుర్తింపు తెచ్చిన సినిమా.

 

ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా ప్రకాష్ రాజ్ గట్టి పోటీని ఇచ్చారు. తెలంగాణా శకుంతల, జయప్రకాష్ రెడ్డి, ముకేష్ రిషి తదితరుల నటించారు. ఈ సినిమాకు మహేష్ ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత పోకిరి సినిమా మహేష్ ని స్టార్ నుండి సూపర్ స్టార్ చేసింది. మహేష్ బాబు తన కెరీర్లో 7 నంది అవార్డులు, 6 ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. కెరీర్ ని వైవిధ్యమైన పాత్రలతో సరికొత్త ప్లాన్ తో మలచుకుంటూ ముందుకి దూసుకుపోతున్నాడు మహేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: