లేడీ సూపర్ స్టార్ గా పేరొందిన విజయశాంతి ఈరోజు అనగా జూన్ 24న తన 54 వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆమె సినీ జీవితం ఎంత అద్భుతంగా కొనసాగిందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ప్రతిఘటన, కర్తవ్యం వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటించిన విజయశాంతి అప్పట్లో సంవత్సరానికి 5-18 సినిమాల్లో నటించేవారు. అయితే 1981 వ సంవత్సరంలో ఆమె తెలుగులో రెండు, తమిళంలో ఐదు సినిమాల్లో నటించగా వాటిలో ఒక్క సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందలేదు కానీ అన్ని సినిమాల్లో ఆమె గ్లామర్ పాత్రలు చేయడంతో సినీ అవకాశాలు రావడం మాత్రం అణువంత అయినా తగ్గలేదు. 1981 లో తమిళంలో విడుదలైన రజంగం సినిమాలో విజయశాంతి బికినీ ధరించి సినీ ప్రేక్షకులకు పెద్ద ఝలక్ ఇచ్చారు. 

IHG
1982లో నాలుగు తెలుగు సినిమాల్లో,  5 తమిళ సినిమాల్లో నటించిన విజయశాంతి అన్నీ గ్లామర్ షో చేసే పాత్రల్లోనే నటించారు. ఆ సమయంలోనే విజయశాంతి తండ్రి శ్రీనివాస్ ప్రసాద్ మరణించారు. దీంతో ఆమె తన తల్లి, పిన్ని వద్ద జీవనం సాగించారు. అప్పటి వరకూ తన తండ్రి సహాయంతో సినిమాల్లో నటించిన విజయశాంతి ఆ తర్వాత తన తల్లి సహాయంతో తమిళ సినిమాల్లో నటించడం ప్రారంభించారు. తదనంతరం 1983లో తెలుగులో పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు పెళ్ళి చేసి చూపిస్తాం అమాయక చక్రవర్తి, ధర్మాత్ముడు వంటి చిత్రాలతో పాటు కన్నడ తమిళ సినిమాల్లో కూడా ఆమె నటించి... ఒక సంవత్సరంలోనే 17 సినిమాల్లో నటించిన హీరోయిన్ గా రికార్డు సృష్టించారు. కానీ ఆ సినిమాలేవీ ఆమెకు మంచి గుర్తింపు తేలేదు. 

IHG
అప్పటి వరకు తాను నటించిన ప్రతి చిత్రం లో ఎక్స్‌పోజింగ్ విపరీతంగా చేయడంతో ఆమె సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ... సినీ అవకాశాలు ఎప్పుడు వస్తూనే ఉండేవి. ఆ సమయంలోనే హీరో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ గ్లామర్ పాత్రలను పోషించే విజయశాంతిని తన నేటి భారతం సినిమా లో కథానాయకిగా ఎంపిక చేసుకొని ఆ సినిమాని 1983 వ సంవత్సరంలో విడుదల చేశాడు. అప్పటివరకు కేవలం రొమాంటిక్ హీరోయిన్ గా పేరొందిన విజయశాంతి... నేటి భారతం అనే విప్లవాత్మక సినిమా తర్వాత అత్యద్భుతమైన నటిగా పేరు తెచ్చుకుంది. 

IHG
ఆమె సినీరంగ ప్రవేశం చేసి నాలుగు సంవత్సరాల్లో నలభై సినిమాల్లో నటించినప్పటికీ ప్రతి సినిమా దర్శకుడు ఆమెలో నటనను కాకుండా కేవలం గ్లామర్ మాత్రమే చూసారు కానీ ఒక్క టి. కృష్ణ మాత్రమే ఆమెలో నటనను చూసి నటన ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇచ్చి ఆమె సినీ జీవితాన్ని పూర్తిగా మార్చివేశారు. అందుకే విజయశాంతి తన గాడ్ ఫాదర్ టి.కృష్ణ అని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దేశోద్ధారకుడు సినిమా లో వచ్చే వచ్చే వాన జల్లు పాటలో తన తడి అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకు సెగలు పుట్టించిన విజయశాంతి ఎన్నో మసాలా సినిమాల్లో నటించి అందరి చేత వావ్ అనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: