టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ నేషనల్ క్రేజ్, ఇటీవల సాహో రిలీజ్ తరువాత మరింతగా పెరిగింది అనే చెప్పాలి. దానికి కారణం, ఆ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ విజయాన్ని అందుకోగా, అటు నార్త్ లో మాత్రం మంచి కలెక్షన్ సంపాదించింది. ఆ విధంగా ప్రతి సినిమాతో తన క్రేజ్ మరింతగా పెంచుకంటూ ముందుకు సాగుతున్న ప్రభాస్, ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీలో హీరోగా నటిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]()
ఇక దీని తరువాత మహానటి ఫేమ్ నాగ అశ్విన్ తో ప్రభాస్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. తొలిసారిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే ప్రభాస్ కు జోడిగా నటిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో, హై టెక్నీకల్ వాల్యూస్ తో నిర్మిస్తోంది. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సిద్ధం చేసాడట అశ్విన్. లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, అత్యధిక వ్యయంతో తెరకెక్కుతున్న తొలి భారతీయ సినిమాగా ఇది నిలవనుందని అంటున్నారు. దాదాపుగా రూ. 600 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్ తో ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో, పలు భారతీయ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లో కూడా తెరకెక్కనున్న ఈ సినిమాకు పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయనున్నట్లు టాక్.
ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్, రూ.450 కోట్లతో యావత్ ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దానిని తలదన్నేలా మరింత భారీ ఖర్చుతో తెరకెక్కనున్న ఈ సినిమా కథ, కథనాల విషయమై దర్శకుడు నాగ అశ్విన్ సహా యూనిట్ సభ్యులు అందరూ ఎంతో జాగ్రత్త వహించి ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా తీయాలని, ఒకవేళ ఏ మాత్రం తడబడ్డా, సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతున్నారు.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి