కొన్నాళ్ల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టిగ్ కౌచ్ విషయమై కొంత రచ్చ చేసిన నటి శ్రీరెడ్డి, ఆ తరువాత తనతో పలువురు సినిమా ప్రముఖులు లైంగిక సంబంధం పెట్టుకున్నారని, ఒక బడా నిర్మాత తనయుడి సహా మారికొందరి పేర్లు బయటపెట్టింది. ఇటీవల తన మకాంని పూర్తిగా చెన్నై కి మార్చింది శ్రీరెడ్డి. అంతకముందు టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి, ఆ తరువాత ఆయన ఫ్యాన్స్ నుండి తీవ్ర నిరసనను ఎదుర్కొంది. 

 

కొద్దిరోజుల అనంతరం ఆ వివాదం సర్దుమణగడంతో, పూర్తిగా చెన్నై కి షిఫ్ట్ అయిన శ్రీరెడ్డి, ఇటీవల కొన్నాళ్లుగా అక్కడి నుండి కూడా ఎప్పటికప్పుడు సినిమాలు సహా పలు రాజకీయ అంశాలపై తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెడుతూనే ఉంది. ఒకానొక సమయంలో నటుడు నాగబాబు పై కూడా విమర్శలు చేసిన శ్రీరెడ్డి, ప్రస్తుతం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న పవర్ స్టార్ మూవీ గురించి తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేసింది. పవర్ స్టార్ మూవీ లోని గడ్డితింటావా సాంగ్ తనకు ఎంతో నచ్చిందని, అలానే ఆ సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన శ్రీరెడ్డి, ఇటీవల తనను పరాన్నజీవి సినిమాలో ఒక క్యారెక్టర్ చేయమని అఫర్ వచ్చిందని, 

 

అయితే తనకు మాత్రం చేయడం ఇష్టంలేక, వారు ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. మిగతా వారి మాదిరిగానే నాకు కూడా కొన్ని విలువలు ఉన్నాయి, నాకు డబ్బు ముఖ్యం కాదు, వర్మ అంటే నాకు మొదటి నుండి మంచి అభిమానం, ప్రేమ ఉన్నాయి. ఆయనపై విమర్శనాత్మకంగా తీస్తున్న ఈ సినిమాలో నటించడం ఇష్టం లేకనే అందులో నటించలేనని చెప్పానంటూ శ్రీరెడ్డి తన పోస్ట్ లో పేర్కొంది. ఓ వైపు వర్మ, మరోవైపు శ్రీరెడ్డి, వంటి వారు తమ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఏవిధమైన తప్పుడు ప్రచారాలు చేసినా, అది ఆయన ఇమేజ్ ని ఏ మాత్రం డ్యామేజ్ చేయలేదని, ప్రజల్లో ఆయనకు ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదని పలువురు పవన్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.....!!   

 

మరింత సమాచారం తెలుసుకోండి: