శ్రీ రెడ్డి గురించి తెలియనివారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఈమె అచ్చ తెలుగు అమ్మాయి మొదట్లో సాక్షి టీవీలో యాంకరింగ్ మొదలుపెట్టి ఆ తర్వాత రంగుల ప్రపంచం పై ఆశ పుట్టి సినిమాల వైపు అడుగులు వేసింది. కానీ అనుకున్నంత స్థాయికి చేరుకోలేక, ఎంత కష్టపడినా అవకాశాలు అందక, నిరాశ చెంది, తెలుగు సినీ పరిశ్రమలో జరిగే కుట్రలు, కుతంత్రాలు ఇవి అంటూ మన ముందుకు వచ్చింది శ్రీ రెడ్డి. సోషల్ మీడియా వేదికపై ఈమెకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా సూపర్ స్టార్ లనే నీ బ్రతుకు ఇది అంటూ తీవ్రమైన విమర్శలు చేసింది. కొంతమంది సెలబ్రెటీలతో తను క్లోజ్ గా దిగిన ఫోటోలను పబ్లిక్ ముందు పెట్టి తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎదగాలంటే ఇలాంటి పనులే చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.


ఇదే రీతిలో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ ఉదంతంతో దగ్గుబాటి రానా తమ్ముడైన అభిరాం పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే...ఇప్పుడు మళ్లీ అదే బాటలో దగ్గుబాటి కుటుంబం పై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. ఇటీవలే దగ్గుబాటి వారసుడు రానా ఓ ఇంటి వాడు కాగా, ఈ సందర్భంగా స్పందించిన శ్రీ రెడ్డి ఓ పక్క రానాకు విషెస్ చెప్తూనే మరోపక్క వివాదాన్ని సృష్టించింది. నీ పెళ్లి ఓకే మరి? మీ తమ్ముడు అభిరాం తో నా పెళ్లి ఎప్పుడు? అంటూ కౌంటర్ విసిరింది. మీ తమ్ముడి తో నా పెళ్లి జరిగినా జరగక పోయినా పర్వాలేదు కానీ, మరో ఆడపిల్ల జీవితం మాత్రం నాశనం చేయకండి అని కోరుకుంది. ఇప్పటివరకు అయిందేదో అయిపోయింది ఇకనైనా మీ తమ్ముని కాస్త కంట్రోల్ లో పెట్టుకోమని రానాకు సలహా ఇచ్చింది. ఇదే సందర్భంగా మాట్లాడుతూ ఇంతకుముందు తనపై తప్పుడు ఆరోపణలు చేసే వారికి తన స్టైల్లో సమాధానం ఇచ్చింది శ్రీ రెడ్డి.


అసలు విషయమేంటంటే దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేయకుండా ఉండడానికి వారి కుటుంబం తో ఒప్పందం కుదుర్చుకుందని, ఆ డీల్ ప్రకారం 6 కోట్లు తీసుకుని హైదరాబాద్ నుండి చెన్నైకి మకాం మార్చిందని తెగ వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటినీ అసత్యాలని తీవ్రంగా ఖండించారు శ్రీ రెడ్డి. నేను వారి దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నా కన్నతల్లి పై ఒట్టు అని ప్రమాణం చేసింది. అయినా ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే వారికి సమాధానం ఇవ్వాలి అనుకోవడం లేదని అలాంటి కుక్కలను వారు అన్న మాటలను పట్టుకుని ఎందుకు ఫీల్ అవ్వాలి..? అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు శ్రీ రెడ్డి. నాపై విమర్శలు సరే.... పేరు పరపతి ఉన్న ఫ్యామిలీ కనుక వాళ్లకి అన్నీ చెల్లుబాటు అవుతున్నాయి. పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు. కానీ అన్యాయం అయ్యే వాళ్లు మాత్రం అవుతూనే ఉన్నారు. వీటిపై మాట్లాడండి అంటూ వాపోయింది శ్రీ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: