కెజిఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ సినిమా ఎప్పుడెప్పుడా అని హీరో అభిమానులు ఎదురు చూశారు. ఈ ఇద్దరి కలయికలో సినిమా ఉంటుందన్న ప్రచారమే తప్ప నిర్మాత ప్రకటన చేయలేదు. అయితే తారక్‌ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తాడన్న టాక్‌ నెట్ లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వార్తతో నందమూరి అభిమానులు భయపడిపోతున్నారు.

కన్నడలో హీరోలు లేనట్టు తెలుగు హీరోతో సినిమా చేయడమేంటని కన్నడిగులు ప్రశాంత్‌ నీల్‌ను ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ఈ వివాదం నడుస్తుంటే.. మరోవైపు ఎన్టీఆర్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడనేది మరో టాక్‌. ఈ వార్త తారక్‌ అభిమానులకు నచ్చలేదు. ఎందుకుంటే.. ఎన్టీఆర్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన చిత్రాలు నిరాశపరిచాయి. ఈ  సెంటిమెంట్‌తో తారక్‌ అభిమానులను  కలవరపెడుతోంది.

సింహాద్రి లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత తారక్‌ నటించిన మూవీ కావడంతో ఆంధ్రావాలా భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయింది.  తారక్‌ ఇందులో డ్యూయెల్‌ రోల్ లో కనిపించాడు. శంకర్‌ పహల్వాన్‌ పాత్రలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు. సినిమా డిజాస్టర్‌ కావడంతో.. తారక్‌ ఇందులో గ్యాంగ్‌స్టర్‌ పోషించిన విషయాన్నే చాలా మంది మర్చిపోయారు. బాద్షా మూవీలో అండర్‌ కవర్‌ కాప్‌గా మాఫియాను ఎదుర్కోవడానికి గ్యాంగ్‌స్టర్‌ అవతారం ఎత్తాడు. రిజల్ట్‌ ఏవరేజ్‌. ఇక ముచ్చటగా మూడోసారి జై లవకుశలో రావణ్‌కుమార్‌గా మాఫియాను గజగజలాడించాడు. ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ఎక్కువ మార్కులు పడినా.. సినిమాకు మాత్రం పాస్‌ మార్కులే.

ప్రశాంత్‌నీల్‌ సినిమాలో ఎన్టీఆర్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడన్న వార్త.. అభిమానులను టెన్షన్‌ పెడుతోంది. ఒకసారి నటిస్తే ఫ్లాప్‌.. రెండోసారి .. మూడోసారి ఏవరేజ్‌ మాత్రమే. నలుగోసారి నటిస్తే.. రిజల్ట్‌ కాస్త బెటరై... హిట్‌ అవుతుందన్న నమ్మకం ఉన్నా.. గ్యాంగ్‌స్టర్‌  రోల్స్ కలిసిరాలేదన్న ముద్ర అభిమానులపై పడింది. ప్రశాంత్‌ నీల్ అదిరిపోయే హిట్ ఇస్తేగానీ.. ఈ ఇంప్రెషన్‌ నుంచి అభిమానులు బయటపడరు.

ఎన్టీఆర్, కెజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందనే ప్రచారం అయితే ఊపందుకుంటోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: