టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి రెండేళ్ల క్రితం భాగమతి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ని అందుకుంది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని యు.వి క్రియేషన్స్ వారు ఎంతో భారీ ఖర్చుతో నిర్మించారు. ఇక దాని అనంతరం కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న అనుష్క ప్రస్తుతం నటిస్తున్న సినిమా నిశ్శబ్దం. యువ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఒక లిరికల్ సాంగ్ కూడా ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టాయి.
అనుష్క, సాక్షి అనే మూగ, చెవిటి చిత్రకారిణిగా ప్రధానపాత్ర తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, అంజలి, షాలిని పాండే, మైకేల్ మ్యాడ్సెన్, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలపై ఎంతో గ్రౌండ్ లెవెల్ లో నిర్మితమైన ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం దగ్గుబాటి రానా చేతుల మీదుగా లాంచ్ చేయబడింది. ఇక ట్రైలర్ ను బట్టి చూస్తే ఆద్యంతం ఎన్నో సస్పెన్స్ అంశాలతో సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఒక పెయింటింగ్ కోసం అనుష్క, మాధవన్ ఇద్దరూ ఒక హాంటెడ్ హౌస్ కి రావడంతో మొదలైన ట్రైలర్ లో ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు ఉన్నాయి.
ముఖ్యంగా మర్డర్, మిస్సింగ్ మిస్టరీ వంటి అంశాలను కూడా ట్రైలర్ లో చూపించడం జరిగింది. మాధవన్, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, అంజలి, మైకేల్ మ్యాడ్సెన్ ల పాత్రలను కూడా ట్రైలర్ లో చూపించారు. మొత్తంగా కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయిన నిశ్శబ్దం ట్రైలర్ కు ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన లభించడంతో పాటు త్వరలో రిలీజ్ కాబోయే సినిమా పై భారీగానే అంచనాలు పెంచేసింది అని చెప్పాలి. కాగా ఈ సినిమా అక్టోబర్ 2న ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.....!!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి