ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ: రెండు జంటల మధ్యన లవ్, ఎమోషన్, యముడి రాసే తల రాతలు ఎలా ఉంటాయో అనేది ఈ యమ డ్రామా ట్రైలర్ లో దర్శకుడు హర్ష అద్భుతంగా చూపించాడు. యమ డ్రామా సినిమా విజయాన్ని అందుకోవాలని, చిత్ర బృందం సక్సెస్ సాధించాలని అలాగే దర్శక నిర్మాతలు హర్ష, టి రామకృష్ణ రావు లను ప్రత్యేకంగా అభినందించారు.
దర్శకుడు హర్ష మట్లాడుతూ: అనిల్ రావిపూడి గారు తన సినిమా పనిలో చాలా బిజీగా వున్నా కూడా మా మీద ఉన్న ప్రేమ తో ఆయన మా యూనిట్ కి తన సలహాలు ఇస్తూ, ఈ సమయాన్ని కేటాయించినందుకు చాలా ఆనందంగా వుంది. యమ డ్రామా ట్రైలర్ అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా విడుదలవడం సంతోషం. యువత చిన్న సమస్యలకు, ఒత్తిళ్లకు లొంగిపోయి కన్నీళ్లు కారిస్తే కాదు.. చమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలరు అనేది తెలుసు కోవాలి అంటూ యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మా చిత్రం తప్పకుండా మంచి సక్సెస్ అవుతుంది అని భావిస్తున్నట్లుగా చెప్పారు.
ఇక అనిల్ రావిపూడి ఈ సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి